పుట:2015.392383.Kavi-Kokila.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము పది] కుంభ రాణా 211

విషదిగ్ధమగు కోఱల నెట్లు దాఁచుకొని యుంటివి? - నే నెంతబుద్ధిహీనుఁడను! ఇంకను ఆ కులభ్రష్టవిషయమై చింతించు చున్నాను; దాని మనోహర ప్రతిమను నాహృదయమునుండి బలాత్కారముగఁ బెఱికివైచితిని. కాని, మచ్చ మాత్రము మాసిపోదు.

ఒక్క దినములో వార్థక్యము వచ్చినట్లు తోఁచుచున్నది! నా జీవితపు పునాదియే సడలినట్లు కదలుచున్నది. నేను కుంభరాణాకన్న నన్యుఁడను భ్రమపుట్టుచున్నది - నాస్మృతి పథమున జీవించియున్న కుంభరాణా, ఇప్పటి నన్ను నీ వెక్కిరింపకుము! - ఆ! గతస్మృతి! ఇది మరణదండనమున కన్న హింసాకరము! ఘోరము!

[కుమారసింహుఁడు ఎగుఊపిరితో పరుగెత్తుకొనివచ్చును]

కుమారసింహుఁడు : అగ్బ రిచ్చటనే యున్నాడు.

రాణా : ఎక్కడ? అంత:పురములోనా?

కుమా : కాదు. యమునామార్గమున రాణిగారిని నే ననుసరించు చుంటిని.

రాణా : కానిమ్ము, ఒక్కమాటలో చెప్పుము! ఎక్కడ?

కుమా : అచ్చట నొకచోట నిద్దఱు మనుష్యులు ఆమెతో మాటలాడుచుండిరి. వారిలో నొకడు "మీమరణ దండనమునకు కారణమైన రాక్షసులమని చెప్పుచుండెను. నేను పరుగెత్తుకొని వచ్చితిని. అతడే అగ్బరు కావలయు.

రాణా : [కోపముతో] ఆ దుశ్చరితుఁడే అగ్బరు కుమారసింహా, నీ వేల యింత మందబుద్ధివైతివి? ఆ యంత:పుర ద్రోహి ప్రక్కలో నొక్క కత్తిపోటు పొడిచి యా సంతోషవార్తను దెచ్చుటకుమాఱు ఊరకయేల బేలవై పరుగెత్తుకొని వచ్చితివి?

కుమా : [చేతులు పిసుగుకొనుచు] ఆజ్ఞకొఱకు.