పుట:2015.392383.Kavi-Kokila.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఎనిమిది] కుంభ రాణా 205

రాణా : [పత్రికను చూచిచూచి యొక్క బాష్పకణము కార్చిరి. కుమారసింహుని చేతికిచ్చును]

కుమా : [నిష్క్రమించును]

రాణా : [దు:ఖ గద్గదస్వరముతో] మీరా. నీ యపరాధమునకు మరణముకన్న నల్పదండనము వేఱొండులేదు. ఇంకొక్క నిమిషములో చిరపరిచితమైన నీ మోహనస్వరూపము, ఏడెనిమిది సంవత్సరములు నా జీవితమున కమృతంపువర్తియైన నీ ముఖేందుబింబము, మర్త్యలోకమునుండి సమ్మార్జితము కాఁగలదు. నా యాశలు నిరాశలైనవి. నా సంసారము నిస్సారమరు ప్రదేశమైనది. - మీరా,...చచ్చితివి....చచ్చితివి...

[సోఫాలో నొరగఁబడును]

[తెరజాఱును]