పుట:2015.392383.Kavi-Kokila.pdf/189

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196 కవికోకిల గ్రంథావళి [స్థలం ఏడు

శ్యామ : అయినను ఈ సమిష్టి నింద యసహ్యము. మన జీవిత మంతయు ప్రభువు శ్రేయోభి వృద్ధులకు ధారవోసితిమి ! అందుకు ప్రతిబహుమానమేమి?

మాధ : అవిశ్వసనీయుల మగుట!

శ్యామ : మరల రాజమందిరమునకు వచ్చుటకుఁ బూర్వము మనకర్తవ్యమును నిశ్చయించుకొనవలయును. మొదటినుండియు రాజు స్వభావము మన మెఱుంగుదుము. అనురాగము గాని విరాగముగాని అతిగాఢము; భావోద్రేకము కలవాఁడు. వదలక పట్టువట్టి తన యభిమతము నెగ్గించుకొనును.

మాధ : చాలవఱకు న్యాయబుద్ధియుఁ గలదు.

శ్యామ : కలదు; కాని, న్యాయబుద్ధియె తప్పుదారిపట్టి అందుకు ధృడ సంకల్పము తోడ్పడునెడల గుణము విషమించి యవగుణ మగును. ఒకవేళ ఆశ్రయనాశకమును గావచ్చును.

మాధ : మనచేత నైనంతవఱకు విప్పి చెప్పితిమి. మన విధి మన:పూర్వకముగ నిర్వర్తించితిమి. రాజుగారి యకార్యమునందు మనము భాగస్వాములము కాము. ఇఁకమీఁది కర్తవ్యము మీరే నిశ్చయింపవలయును.

శ్యామ : భాగస్వాములము కాము గదాయని తృప్తిపడి యుండకూడదు. పవిత్రశీలయగు రాణిగారు రక్షింపఁ బడవలయును.

మాధ : అవును. మా మంత్ర ప్రయోగమునకు అవకాశ మేర్పడినది.

శ్యామ : సైన్యాధిపతి మన యభిప్రాయమునకు విరుద్ధుఁ డయ్యె నేని అతని నెట్లయిన మనప్రక్కకుఁ ద్రిప్పుకొనవలయును.

మాధ : అదిచాల ముఖ్యము.

శ్యామ : రాణిగారిని సంరంక్షిచుటకొఱకు రాణాగారిని తిరస్క