పుట:2015.392383.Kavi-Kokila.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము 7 : రాణాగారి విశ్రాంతిమందిరము.

_________

[పట్టు మెత్తలుకుట్టిన సోఫాయుండును. దానికి కుడి ప్రక్కన రెండుకుర్చీలు వేయఁబడియుండును. ఎడమ ప్రక్కన ఒక చిన్న టేబిలుపై హుక్కాయుండును. రెండు మూడు పుస్తకములు పెట్టఁబడియుండును. రాణా ఆలోచనా నిమగ్నుఁడయి అటునిటు పచారుచేయుచుండఁగా తెరయెత్తఁబడును. రాణా కుదుటపడని మనస్సుతో ఒకతూరి పుస్తకము తీసికొని పుటలుత్రిప్పి మరల బల్లపై పెట్టును. అటునిటు తిరుగును. ఒక్క గ్రుక్కెడు హుక్కాపీల్చి గొట్టమును బల్లపై పెట్టును. రాణా యిట్లు మనస్సంక్షోభము కనఁబఱచు చేష్టలు ఒకటి రెండు నిమిషములు చేయును.]

రాణా : మీరాయొక్క నడవడి విడదీయరాని చిక్కుగ నేర్పడినది. ఇది యది యని నిర్ణయించుటకు వీలు కాకున్నది. కొందఱు దీనిని మతావేశమని చెప్పుచున్నారు. మతావేశముకూడ యొక మానసిక వ్యాధియనియే నాయుద్దేశము. [సోఫాపై కూర్చుండును] ఔరా ! నాకన్నుల యెదుటనే నా జీవిత మెట్లు మాఱిపోయినది ! ప్రేమకు విషయీభూతమగు వస్తువే ద్వేష ప్రేరకమైనయెడల - ఈరాజ్యమేకాదు, ప్రపంచమునంతయు నేలు వానికైన శాంతిలేదు, ఆనందములేదు. - హృదయము శ్మశానము. జీవితము మరుప్రదేశము. ఇంతకన్న దు:ఖకరమైన ఆంతరిక సంక్షోభము వేఱొండు లేదు. [లేచి అటునిటు తిరిగి] తనకు తెలిసి మీరా నన్ను తిరస్కరించుట