పుట:2015.392383.Kavi-Kokila.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఏడు] కుంభ రాణా 185

కొనఁగలఁడా? అక్క సెలియండ్రను ఆలుబిడ్డలను మొగలాయి పాదుషాల కర్పించి యా యపకీర్తి మూల్యముచే నున్నతోద్యోగముల విలిచి నీచ జీవనము సేయుచు చిరంతన యశో విరాజితమైన రాజపుత్ర కులమునకు కళంకము దెచ్చిన మానసింహాదులవంటి పతితుఁడ ననుకొనెనా నన్ను ? ఎన్ని యుపాయములైన పన్ను గాక, కుంభరాణా అగ్బరునకు ప్రాణముతో లోఁబడడు. [బలవంతరావు తట్టు తిరిగి] ఓయీ నిద్దురపోతా, నీ యజాగ్రత్తవలన గదా మాయంత:పురమున కింత యపనింద కలిగినది ?

బల : [లేచి. గద్గద స్వరముతో] మహాప్రభూ, అంత: పురాధికారి నౌట నేనే యపరాదిని. వృద్ధుడనౌట బుద్ధిపాటవముకూడ తగ్గిపోవుచున్నది. కన్నులును చక్కగ గనబడవు. నన్నిక నుద్యోగ విముక్తుని గావింపవలయునని ప్రార్థించుచున్నాను.

రాణా : ప్రార్థన మవసరములేకయే నిన్ను పదబ్రష్ఠుని గావించు చున్నాను; నీవయస్సు, నీస్వామిభక్తియు, నీప్రాణములను దక్కించినవి. వెడలిపొమ్ము.

బల : మన్నింపబడితిని. ధన్యుడను. [తాళములు రాజుముందర పెట్టును]

రాజసేవ కత్తిపైని సాము ! [నిష్క్రమించును]

సుశీ : [స్వగతము] ఈ ముసలిబాపడు మేయబోయి మెడకు దగిలించుకొన్నాడు. ఆ వాసంతిక మాటవిని నామీద చాడీలు చెప్పినందుకు ఆ వుద్యోగం కాస్తా వూడిపోయింది.

రాణా : మాకు విశ్వాసపాత్రుఁడైన కుమార సింహుని అంత:పురాధికారినిగా నియమించితిమి. ఉత్తరువు సాదరు చేయించుఁడు.

శ్యామ : చిత్తము. దేవరవారు చాలా న్యాయముగఁ దీర్మానించితిరి. కుమారసింహుడు పసిప్రాయము వాఁడగుటవలన అతని తండ్రి యుద్యోగమును బలవంతరావుగారి కొసఁగఁబడియుండెను. ఇప్పుడు కుమార