పుట:2015.392383.Kavi-Kokila.pdf/177

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184 కవికోకిల గ్రంథావళి [స్థలం ఏడు

మాధ : [హారమును తాను తీసికొని] ఇది నమ్మతగినది కాదు.

సుశీ : నిజమేనండి ధొరగారు.

మాధ : నీవు చూచితివా?

సుశీ : నా చేరడేసి కళ్ళనిండా చూచానండి.

రాణా : రావుజీ, వైద్యులు మనయంత:పురమునకు వచ్చినమాట యధార్థము. ఆసంగతి బలవంతరావుగారె చెప్పిరి.

బల : వచ్చినమాట వాస్తవమె.

రాణా : ఆవైద్యులే యీ హారమును దెచ్చియుండక పోయిన, అంతరాళము నుండి యూడిపడి యుండునా !

శ్యామ : వారు నిక్కువమైన వైద్యులైనట్లు తోఁపదు.

రాణా : నేనును అట్లెతలంచితిని. ఎవరో దురాత్ములైన సంస్థానాధిపతులు మాయంత:పురము నపవాద కళంకితము కావించుటకొఱకు వైద్యవేషధారులై వచ్చిరి, - నీకు వారి యుచ్చారణలో భేదమేమైన గోచరింప లేదా ?

బల : [తత్తరముతో] ఏదో కొంచెముండి నట్లుగనే తోఁచుచున్నది. నాకప్పు డనుమానము తట్టనందువలన అంతగా పరిశీలింపలేదు. కొంత మొగలాయిదేశ స్పర్శ ఉండినట్లుగా భ్రమ.

రాణా : ఆ1 - తెలిసినది. ఇది యంతయు ఆ కపటాత్ముఁడు అగ్బరు పన్నిన కుట్రవలె నగపడుచున్నది. నన్ను శౌర్యముతో లోఁబఱచుకొనలేక యిట్టి యధమకృత్యమున కొడిగట్టి యుండును - మీరేమి తలంచెదరు?

శ్యామ : మన యూహావలంబనమునకు ఇంకను కొన్ని, ఘనిష్టములైన యాధారములు దొఱకవలయును.

మాధ : ఒకవేళ ప్రభువుగారి యూహ సత్యముగనే యుండవచ్చును. మొగలాయివారు ఎట్టి నీచకార్యములకైన సాహసింపఁ గలరు.

రాణా : ఆ దుర్వివేకుఁడు ఇట్టి కుతంత్రములవలన నన్ను లోఁబఱచు