పుట:2015.392383.Kavi-Kokila.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము ఆఱు] కుంభరాణా 175

సుశీ : నేనింక అధికారంచేస్తే వొక్కదాసీతొత్తు కూతురుకూడా పల్లెత్తు మాటనలేదు. నా హారంచూచి గపుచిపుమని నోరుమూసుకోని పోతారు.

వాసం : ఈ దయ్యాల మంగిని చీపురుకట్టతో శివాళించ బుద్దేస్తుంది. దీని కెక్కడి దీ హారము? ఏ మిండమగడైనా యిచ్చిపోయినాడా యేం?

సుశీ : నాకు మంచికాలం వచ్చేసరికి ఆ వైద్దుగులు దొరసానమ్మకు హారం నజరిచ్చి పోయినారనుకుంటాను. లేకపోతే వుట్టవుడియంగా హారాలు ఆకాశం బిందచేసుకొని కిందపడతవా ?

వాసం : ఆ ! తెలిసింది. ఎవరో నజరిచ్చి పోయిన హారాన్ని రాణిగారు మాంద్యంలో వుండేటప్పుడు ఈ మాయలాడి తట్టేసివుంటుంది.

సుశీ : ఆవాసంతిక నా అందాన్ని చూచి చూపోపలేక గొంతుకు వురివేసుకోని చస్తుంది.

వాసం : [మెటికలు విఱచుచు] ఓసి లంబాడి, నీబుగ్గలుకోసి వండివేస్తే పదిమంది సిపాయిల కడుపులు నిండుతాయి. నీయందాన్నిచూచి నేను వురివేసుకోని చావాల్నా ?

సుశీ : సరిసమానుల్లో వొకరికి కొత్తగా భాగ్యంవస్తే తక్కినవాళ్ళ కళ్ళల్లో కారం చల్లినట్లుంటుంది. వాళ్ళయీసు నన్నేమి చేస్తుంది ? కొంచెం వోరపైటవేసుకొని మద్యరంగంలో పనివున్నట్లు తిరుగుతుంటాను, ఎవరైనా యెక్కడి దీహారమంటే రాజాగారిచ్చినారని రహస్యంగా చెబుతాను.

వాసం : [ఈమాటలు విని నవ్వునిలుపుకొనలేక పక్కున నవ్వును.]

సుశీ : [ఉల్కిపడి] ఎవరక్కడ? - వాసంతికా?

వాసం : అమ్మా, దొరసానమ్మా, అట్టాంటిరాజు నాకూ మొగుడైతే నేను రాణిగారికి చవితినై వుందునుగదా!

సుశీ : [ప్రాణములు పోయినట్లు దిగాలువడును] ఈలంజె కూతురు అంతా విన్నది [తెప్పరిల్లి] వాసంతికా, యెంతసేపైంది నీవు వచ్చి ?