పుట:2015.392383.Kavi-Kokila.pdf/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము 6 : రాణిగారి అలంకార మందిరము.

_________

[తెర యెత్తఁబడునప్పటికి సుశీల అచ్చట సామానులు సరదుచుండును]

సుశీల : అదుష్టం గోడమీది పిల్లి దూకినట్లు దూకుతుంది. కలలో నైనా యిట్టాంటి హారం వేసుకొనే దినం వస్తుందని నే ననుకోలేదు.

[రవికెలో దాచియున్న హారమునుతీసి కన్నులద్దుకొని, మెడలో వేసికొని అద్దముచూచుకొనుచు పాపట దిద్దుకొనుచు]

దాసీయని పేరేగాని నాకుమాత్రం అంద చందాలు లేవా యేంటి? రాణివాసంలో పుట్టేవుంటే నేనూ రాణినై యుండేదాన్నే.

[ఇంతలో వాసంతిక ప్రవేశించి, సుశీల మాటలువిని యొకప్రక్క నక్కియుండును.]

వాసంతి : ఈగదిలో యేంచేస్తుంది సుశీల? రాణిగారిని వదలిపెట్టి యిక్కడ తారాడుతుంది. [కొంచెము వంగిచూచి] ఓహో! అందం చూచుకొని మార్ఛపోతుంది. ఆమొఖం యింకా కాస్తబాగుంటే అద్దం రవికెలోనె వుండాల్సి వుంటుందేమొ.

సుశీ : అందంలో రాణిగారికి చవితినిగా వున్నాను. మఱి యీ హారంవల్ల నాఅందం యిమ్మడించింది.

వాసం : [ఆశ్చర్యముతో] ఇదేంటి యీవిచిత్రం! ఈబుగ్గలబూచి ! కడుపులో యెన్ని ఆలోచనలున్నాయి ! వొక్కదెబ్బలో రాణిగారికి చవితై పోయింది ! ఇంక రాణాగారివంటి మొగుడొక్కడే తక్కువ !