పుట:2015.392383.Kavi-Kokila.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172 కవికోకిల గ్రంథావళి [స్థలం ఐదు

తాన్ : 'నీవు నిన్నెఱుఁగవా? నీవు శ్రీకృష్ణుఁడవు గావా ?' యను వాక్యముతో మనకు చిరంతన సత్యమును బోధించినది.

సుశీ : [కనులెత్తి] అబ్బో! మరల దోమరాటుకూడా యెక్కువైంది. [పైటతో విసరుకొనుచు] కన్నట్టైమూయనీయ వీ పాపిష్టిదోమలు - అయ్యా, యేమైనా మందిచ్చిపోతున్నారా ? కుప్పెకట్టయితే మఱొక్క సుట్టు యెక్కువగా సాదియ్యండి. కాస్త యిచ్చాపత్తెం పెట్టండి. పాపం మారాణిగారు ఇప్పటికే సన్నగిల్లి పోయారు.

అగ్బ : ఆమెపిచ్చికి ఆమెయొద్దనే మందుగలదు. దానిని మేము గూడ కొంచెము గ్రహించితిమి.

సుశీ : [స్వగతము] వీళ్ళకుగూడా పిచ్చిపట్టిందాయేంటి ! ఈపిచ్చి అంటురోగమాల అందరికీ తగులుకొనేటట్టుంది. ఈ గాలితగిలి నాకుగూడ పిచ్చిపట్టిందోయేమొ అద్దముచూచుకొనివస్తాను. [నిష్క్రమించును.]

అగ్బ : ఈదాసి మనల ననుమానించి యుండదుకదా.

తాన్ : అది తూగుబోతు.

అగ్బ : తల్లీ, ఈగురుకట్నమును గ్రహింపుము. ఈ హారమును శ్రీ కృష్ణునకు స్వయంవర హారముగ సమర్పింపుము.

[మీరాబాయి అంజలిలో హారమును విడచును.]

తాన్ : ఈబీదకట్నమునుగూడ సంగ్రహింపుము. [పూవులదండను దోసిట విడచును.]

[దండముపెట్టి యిరువురు నిష్క్రమింతురు. ధ్యాన నిమగ్నయైయున్న మీరాబాయి చేతిలోనుండి హారము క్రిందికి జాఱిపడును.]

సుశీ : [ప్రవేశించి] అద్దములో చూచుకొంటె ముందరి మొఖం