పుట:2015.392383.Kavi-Kokila.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166 కవికోకిల గ్రంథావళి [స్థలం ఐదు

తనలో తానే మాట్లాడుకొంటుంది. ఇప్పుడే కన్ను మాల్చింది. ఇంతవఱకు నేను విసురుతునే వుణ్యాను - కానీ, యీసంగతంతా నేనుపోయి బలవంతరావుగారితో విన్నవిస్తాను. అంతదాకా రాణిగారి దగ్గర వుంటావుగదూ ?

వాసం : ఆమాటలు చెప్పడానికి యెవరితెలివైనా యెరవుతెచ్చుకోవాల్నా యేంటి ? [నిష్క్రమించును.]

సుశీ : ఇది బహుచమత్కారి తొత్తుకూతురు. మఱచిపోయైనా మోసపోతుందంటె మోసపోదు. రేయింబవుళ్ళు నన్నే పడిచావమంటుంది.

మీర : [ఉల్కిపడిలేచి బయలుచూచు] హృదయేశ్వరా, యింతలో నా కౌఁగిలి విడిపించుకొని యెట్లుపోయితివి ? ఎచ్చటికేగితివి ? ఈదీనురాలిని వంచించుటకు నీకు మనసెట్లు పుట్టెను ? ఒక్కస్థలమున నుందువని నిర్ణయములేని నిన్ను నే నెక్కడయని వెదకుదును ?

                     ఉందువో మౌనిజనోత్ఫుల్ల హృదయాబ్జ
                               కర్ణికా నాట్య రంగములయందు?
                     ఉందువో శాంత రసోజ్జ్వల మూర్తివై
                               క్షీరాబ్ధిలో మృదుశేషశయ్య?
                     ఉందువో దీనావనోద్యోగ రతుఁడవై
                               తలపోఁత కందెడు దవ్వునందు ?
                     ఉందువో నిర్వాణయోగ సంధాయివై
                               రాస లీలా భోగరాజ్యమందు?

                     ఇంక నెచ్చోట నుందువో యెవరికెఱుక?
                     సృష్టినాటక సూత్రధారివి ! నిరంత
                     ప్రకృతి కేళీ వినోద హర్షంబు కొఱకు
                     బొమ్మరిలు గట్టి తుడిపెదు మొదలుసెడక.