పుట:2015.392383.Kavi-Kokila.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఐదు] కుంభరాణా 165

లేక నిందించితిని. సందేహించితిని. విషయవాంఛా మలీమసములై గోపికల హృదయములను విరహాగ్ని జ్వాలలందు పరిశుద్ధము గావించి, వారికి నిర్వాణసామ్రాజ్యము నొసంగితివి. నీదాసురాలను నన్నుఁగూడ నట్లే పరిశుద్ధము చేయుటకు ఈ యుపాయము పన్నితివి కాఁబోలు! "సకలాంతర్యామినైన నన్ను ఈ యజ్ఞానవతి యెఱుంగలేక మందిరము మందిరమని భ్రమపడుచున్నది. దీనికి చక్కని గుణపాఠము నేర్పించెద"నని యెంచి, నాకీ బంధనము విధించియుందువు. ఆపత్పరంపరలు మహోపకార గర్భితము లను గభీర సత్యమును నేఁడు గ్రహించితిని. కృష్ణా, నీకరుణ అనంతము ! అనంతము !

[ధ్యాననిర్మగ్న యగును.]

[వాసంతిక ప్రవేశించును.]

వాసంతిక : సుశీలా, యెక్కడ?

సుశీ : [తూఁగుచుండి యుల్కిపడిలేచును] మల్లీ మందుతెచ్చావా ? అమ్మగారు వొక్కచుక్క పోకుండా మందంతా తాగేశినారు.

వాసం : దొరసానమ్మగారు అ అవస్తలో వుంటే నీవు నిమ్మళంగా నిద్రపోతున్నావా ?

సుశీ : నీవొక్కదానివే బయబక్తులతో నవకరి చేసేదానివిన్నీ తక్కిన వాళ్ళందరూ కూలికి పనిచేసేవాళ్ళు. ఎందుకీ పనికిమాలిన బడాయి ? వచ్చినపని చూచుకోని పోరాదూ.

వాసం : సుశీలమ్మగారూ, బుద్ది, బుద్ది. [చెంపలువేసుకొనును] రాణిగారికెట్లావుందో కనుక్కోని రమ్మన్నారు బలవంతరావుగారు. మందు తాగిన వెనుక నెమ్మదిగా పడుకుందోలేదో కూడా అడిగి రమ్మన్నారు.

సుశీ : బుద్దితో అట్లా అడుగు చెబుతాను. - మునుపటికంటె పైదుర్గుణాలేమి కనిపించలేదు. ఇంకా కాళ్ళుముక్కు పీక్కునే సితికిరాలేదు.