పుట:2015.392383.Kavi-Kokila.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము - 5 : అంత:పురము

________

[మీరాబాయి ధ్యాననిమగ్నయై యుండును. తెరయెత్తఁబడును. సుశీల మందుగిన్నెతో ప్రవేశించును.]

సుశీల : రాణిగారూ, ఈమందు కొంచెం పుచ్చుకోండి. ఈసారం కడుపులోకి పొయ్యేసరికే పిచ్చి కుదురుతుందట.

మీరా : [పలుకదు]

సుశీ : ఈమెపిచ్చి మందూమాకులతో కుదిరేలాగులేదు. మూడు దినాలు నుంచీ అన్నం నీళ్లు అంటకుండా ద్యాన్నించుకొంటూ, పాడుకొంటూ, నవ్వుకొంటూ మనలోకంలోనే లేదు. మా లలితకు జన్నిగుణం తగిలినప్పుడు ఈలాగే వుణ్ణింది. ఇట్టాంటి రోగాలు కట్టెతోగూడా పోవాల్సిందే - అమ్మ గారూ, కొంచెమయినా యీమందు తాగండి.

మీరా : [ధ్యాన నిమగ్నయై పలుకదు.]

సుశీ : మందంతా తాగేశిందని బలవంతరావుగారితో చెబుతాను. [ఒకప్రక్కకువచ్చి మందు క్రింద పాఱఁబోసి మెల్లఁగా స్తంభమున కానుకొని తూఁగుచుండును.]

మీర : [మెలమెల్లఁగఁ గనులెత్తి] శ్రీకృష్ణా, రాధామనోవల్లభా, దీనావనదీక్షా పరతంత్రా, నన్నేల యీనిర్బంధమున నుంచితివి ? నేనేమి యపరాధ మొనరించితిని ? నీమందిరమునకు వచ్చి నీదివ్యసుందరమూర్తిని సేవింప నీయక నాభర్త నన్నీ యంత:పురమున బంధించియుండుట నీకు సమ్మతమేనా ? - తమ సర్వస్వమును నీపాదములకు నర్పించిన పల్లెటూరి గొల్ల పడుచుల సైతము నల్లాటవెట్టుట కలవాటుపడిన నీకు న న్ను పేక్షసేయుట యొకవింతయా ! - ఓభక్తవత్సలా, యజ్ఞానముచే నీసదుద్దేశమును తెలిసికొన