స్థలం మూడు] కుంభరాణా 153
త్మునిపై ఏల నీకు గౌరవము ? నా నెత్తురు తుకతుక యుడికిపోవుచున్నది.
మీరా : [దీనముగ] అయ్యో! నేనేమిసేయుదును ? నాదురదృష్టమువలన నామాటలలో మీకు విపరీతార్థములు తోఁచుచుండును. నేను విన్నసంగతి యంటిని ?
రాణా : అవునవును! విన్నసంగతి యంటివి. అంత:పురమున నీకు వాని ప్రసంగములతో ప్రొద్దుపోవుచుండెనా ? వెడలిపొమ్ము, నామనము సంక్షుబ్ధమైనది.
మీరా : [కన్నీరు నించుచు] మీకింత మనోవేదన కలిగించు నేనుండియేమి ఉండకయేమి ? శ్రీకృష్ణా, ఆపద్బాంధవా, నన్ను నీకడకు చేర్చికొమ్ము.
[నిష్క్రమించును.]
రాణా : ఎంతకాల మీయింటిలోనిపోరు ? - హృదయములోని కొలిమి ? - నాసతి నావిరోధికి వత్తాసివచ్చుట ? - రవంతయైన యళుకు లేక ఆతుచ్ఛుని జనక మహర్షితో సరిపోల్చుట, ఆ కాంత ధిక్కారము హృదయ శల్యమువలె పీడించుచున్నది. మన కింక శాంతిలేదు. మీరా, మన యిద్దరిలో నెవ్వరైన నొకరు చావవలయును.
[నేపథ్యమున] చేటిక : ఇద్దరున్నూ.
రాణా : ఏమి యీయుపశ్రుత ? ఎవరక్కడ ?
చేటిక : [ప్రవేశించి] దాసురాలిని వాసంతికను. రాణిగారూ సుశీలా యెక్కడికి పోయారని గోస్వాములవారడిగారు. ఇద్దరున్నా యిప్పుడే దేవాలయం తట్టుకు పోయారని చెప్పేసరికి దేవరవారు హెచ్చరించుకొన్నారు.
రాణా : మరల ఆయున్మాదిని దేవాలయమునకు పోయెనా ? ఈ గోస్వాములు మహిషస్వాములు మాసంసారమిట్లు వల్లకాడుచేసిరి. ఏడి యాసన్యాసి ?
[తొందరగ నిష్క్రమించును.]