పుట:2015.392383.Kavi-Kokila.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాంకము] సీతావనవాసము 109

ప్పటినుండి నామనము పరిపరివిధములఁ బోవుచున్నది ! అదియేలొకో వీరి ముఖమండలముల వైదేహి పోలికలు పొడకట్టుచున్నవి. నాభ్రాంతియె యిట్లు తోఁపించుచున్నదా ?

[ప్రకాశముగ] కుమారులారా, యిటురండు.

వాల్మీ : [స్వగతము] వాత్సల్యబీజమా, యంకురింపుము.

కుశలవులు : [అనుజ్ఞకై వాల్మీకితట్టు చూతురు.]

వాల్మీ : నాయనలారా, భయపడకుఁడు. రామభద్రుఁడు సర్వప్రజలకు జనకప్రాయుఁడు.

కుశలవులు : [రాముని వద్దకిపోదురు.]

రాము : [ఇరువురను రెండుచేతులఁ జేరదీసికొని, స్వగతము]

                     ఆహా ! యేమి యీ యాశ్చర్యము !

                     ఈ మనోహరాంగు లీ ముద్దుకొమరులు
                     నన్ను నంటినంత సన్నుతాంగి
                     జనకజాత హస్త సంస్పర్శమట్టులఁ
                     గాయమెల్ల నమృత కలితమయ్యె.

కుశు : [స్వగతము] ఏమి, యీ మహాత్ముని తాపసాదరణము ?

లవు : [స్వగతము] తండ్రి కౌఁగిలి నెఱుంగని నాశరీరము ఈ మహారాజుకౌఁగిట సుఖించుచున్నది.

రాము : కుమారులారా, మీనామధేయము లేమి ?

లవు : మహారాజా, యీయన కుశుఁడు.

కుశు : రాజచంద్రా, యీతఁడు లవుఁడు.

రాము : [స్వగతము] ఎంత కఠోరసంబోధనములు !

వసి : వత్సా, యిఁక యజ్ఞవిధుల గమనింపుము.