Jump to content

పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/643

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

కలుఁగు నీ శతకము వ్రాయఁ గాంక్షఁ జదువ | విన్న జనులకు నీ కృపావిలసనమున,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

116


క.

శ్రీవిశ్వనాథశతకము
భావుకమతి నెవ్వరేని పారాయణముం
గావించిన వారలకున్
జీవన్ముక్తి యొనఁగూర్చు శివుఁ డధికదయన్.


శ్రీవిశ్వనాథశతకము సంపూర్ణము.