పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/629

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అనృతోక్తు లాడింప నాలోచనము చేసి | కపటముఁ బన్నిన గాధిపుత్రు
కొఱకు హరిశ్చంద్రకువలయేశ్వరుఁడు భా- | ర్యను నందనుని విక్రయంబొనర్చి
తాను చండాలునొద్దను మధుమాంసముల్ | మోచుచుఁ గడలేని నీచవృత్తిఁ
దిరుగుచునుండఁ దద్విభునకు సౌహార్ద్ర- | మొప్పఁ బ్రత్యక్షమై యున్నతముగ


గీ.

సర్వసర్వంసహాచక్రధూర్వహాఢ్యుఁ | జేసి వాసిగఁ జెలఁగితివౌ సితాంగ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

86


సీ.

అభినవగానవిద్యాశక్తిచే మనోం- | బుజ మలరింపఁ దుంబురుఁడఁ గాను
బరిహాసవాక్యవైఖరిచేఁ బ్రమోదంబు | ఘటియింప నే భృంగిరిటుఁడఁ గాను
విపులకవిత్వప్రవీణత మెప్పింప | వావిరి గంధర్వవరుఁడఁ గాను
వాస్తవముగ నీ స్తవం బొనరింప ని- | మ్మహిలోఁ బరాశరాత్మజుఁడఁ గాను


గీ.

యిట్టులొనరింప నాచేత నెట్టులగును | నీదు చిత్తము నా భాగ్యమో దయాబ్ధి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

87


సీ.

పంచామృతంబు గూర్పఁగ లేకయుండిన | శుద్ధోదకంబు దెచ్చుకొనలేనె