పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/628

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

తారుమారయ్యె నీ ప్రవర్తనలు చూడ | నబ్రము గదయ్య సానుమదతినికాయ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

83


సీ.

ధీరాళ్యభీష్టదాతారం గణాధినే- | తారం సపత్నహంతార మఘవి-
దారం యమీంద్రమందారం సువితరణో- | దార మంకస్థితదార మురగ-
హారం హలాహలాహారం మహిధ్రవి- | హారం విచారప్రహార మమిత-
సారం విధూతసంసారం ధృతాభ్రకా- | సారం ఘృణారసాసార మీశ-


గీ.

మహ ముసాసే యటంచుఁ బ్రత్యహముఁ దలఁతు | భాసురే భాసురత్వగ్విలాసవాస,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

84


సీ.

సంగోరు మెయినిడ్డ చలిమలబిడ్డతో | వడిగల గిబ్బవార్వమ్ముతోఁడ
మూఁడవకన్నుతో ముయ్యంబువాలుతో | సిరులీను రుదురక్కసరులతోఁడ
నగవొప్పుమోముతో జిగికప్పుమెడతోఁడ | గాలిమేతరిసూడిగములతోఁడ
బూచులగములతోఁ బూపజూబిలితోడఁ | జంకను బెట్టిన జింకతోఁడ


గీ.

వేగమున నాకుఁ బొడసూపవే గడంకఁ | గందు మనసారఁ గన్నుల కరవు దీర,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

85