పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బద్మాధిపతి మహాపద్మాధిపతియును | జోడుగా సంగడికాడు గాఁగఁ


గీ.

జెలఁగు నిను జిన్మయుండంచుఁ జెప్పుచుందు- | నెపుడుఁ బ్రామినుకులు నెడ యింత లేక,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

81


సీ.

అవిరతగుణశాలివౌట నిజంబు దూ- | రములయ్యె నన్నవస్త్రములు నీకు
నిరతశివాసక్తనిర్ణిద్రుఁడవు గదా | ధర్మవిద్వేషము దవిలె నీకు
లావణ్యయుక్తనూలసితుండవే కదా | క్షారసంపర్కంబు గలిఁగె నీకు
వివరింప నిర్మోహివే కదా ధరలోన | నసమాక్షయుగభిఖ్య హత్తె నీకు


గీ.

దొడ్డవారికినైనను జెడ్డగొనము | కొంత గలుఁగదె కలిఁగినఁ గొదువ యేమి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

82


సీ.

అనుపమచిత్రకాయయుతుండవై హత- | చిత్రకాయుండవై చెలఁగినావు
రాగముక్తుండవై రతిరాజభస్మాంగ- | రాగయుక్తుండవై ప్రబలినావు
సారంగధరుఁడవై సాహసం బేపార | సారంగహరుఁడవై గేరినావు
గోత్రవర్జితుఁడవై గోత్రాధిరూఢగ- | రిష్ఠత్వ మంగీకరించినావు