పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/626

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సౌరి భీకరగదాధారియై నిలుచుండఁ | గర్బురేంద్రుఁడు పాదుకలు ధరింప
వరుణుడు కాళాంజి పట్ట సమీరుండు | వీడియ మొసఁగంగ విత్తవిభుఁడు


గీ.

చేరి కైదండ యిడఁగఁ గచేరియందు | గద్దెపైఁ గూరుచుండవే కడుముదమున,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

79


సీ.

హరిరాట్కిశోరంబు హరికిశోరము గాదె | నీ విక్రమమునకు నిభము గాక
గ్రావవతంసంబు గ్రావమ్ము గాదె నీ | ధీరసంపదకును దీటు గాక
సింధురాజం బల్పసింధువు కాదె యు- | ష్మద్దభీరతకును సవతు గాక
ఖద్యోతబింబము ఖద్యోతమగుఁ గాదె | నీ ప్రభాపటలికి నీటు గాక


గీ.

భీమ నీ శౌర్యధైర్యగాంభీర్యరుచుల | కేమి సదృశముఁ దెల్పుదు నింకఁ దెలుపు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

80


సీ.

ఉత్పలప్రియుఁడు మహోత్పలప్రియుఁడు పూ- | దండగా మేల్బండియుండ గాఁగ
బలవిరోధియు మహాబలవిరోధియుఁ బడ- | వాలుగా మేల్మెడనూలు గాఁగ
రజితాచలము మహారజితాచలము నివ- | సనముగా నవశరాసనము గాఁగఁ