పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

దారాదికేషణత్రయము వర్జించి స- | త్వాదిగాఢగుణత్రయంబు విడచి
తాపత్రయముఁ బరిత్యక్తముఁ జేసి స- | య్యన మలత్రయవిమోచన మొనర్చి
వాసనాత్రయమును వదలి పెద్దయు మండ- | లత్రయాగమ్యస్థలములు వెదకి
యంగత్రయోజ్జ్వలవ్యాపారము నెఱింగి | లింగత్రయాంతర్విలీను లైన-


గీ.

వారలకు దుర్ఘటామృతద్వాఃకవాట- | విఘటనము సేత సేకూరు వేగిరమున
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

75


సీ.

ఏఁబదిరేకులచే బిందుసంయుక్త | పంచాశదక్షరపంక్తిచేత
నలరారెడు సమంజసాధారనామచ- | క్రాదిషట్చక్రముల్ హర్ష మలర
గ్రమమున శోధించి ఘనతదీయోపరి- | భాగసహస్రార పద్మవిహర-
మాణ మరాళసామ్రాడ్విలోకన మాచ- | రించు మాన్యులకు సిద్ధించు ముక్తి


గీ.

కామినీసంగమము వృథా పామరులకుఁ | గలుఁగునె సుధీపచేళిమకల్పభూమి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

76


సీ.

భూతధాత్రీముఖ్య భూతపంచకమును | శబ్దాది విషయపంచకము మఱియు