పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తారకేశ్వరు నిరంతరము గౌరవమునఁ | బూజించి దివిజులు పూజ్యులైరి


గీ.

యిన్ని రూపులు నీవౌట యెఱుఁగరాదె | శాస్త్రవేత్తల కేలకో సంశయంబు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

70


సీ.

భాసురతరమహాభవనముల్ తగునయ్య | యఖిలాంతరాత్ముఁడవైన నీకు
కనదురుదీపితైకస్నేహవర్ధిష్ణు- | తనరే స్వయంప్రకాశసుఖ నీకు
నూర్ముల సంగతి యొప్పునే పరికింప | నహహ నిరాకారివైన నీకు
మేటి శతాంగాదులేటికిఁ బరికింప | హరవిరాడ్రూపుఁడవైన నీకు


గీ.

నాదిమధ్యాంతకూన్యుఁడ వైన నీవె | దేవుఁడవు నేను పరుల నుతింపఁబోను,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

71


సీ.

ఉపనిషదర్థసౌధోపరితలములఁ | జరియించు నెవ్వాఁడు సంతతంబు
సఫలజంతుఫలద్రు సరణి నజాండముల్ | భరియించు నెవ్వాఁడు ప్రకటమహిమ
నాపాదమస్తకాభ్యాంతరాళములందు | ధరియించు నెవ్వాఁడు ధవళరక్ష
రూఢిఁ గామక్రోధలోభమోహాదులు | హరియించు నెవ్వాఁ డహర్నిశంబు