పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డారయ పడగ విసారమౌట యెఱింగి | నిజసత్వ పరసత్వ నిర్ణయంబు
దెలియక నీమీఁద నలరు [1]తూపుల నేయ | నలికాగ్నిచేతఁ దదాత్మభవుని


గీ.

భస్మ మొనరించి జగములు భయము నొంద | రౌద్రరసరేఖఁ జూపవే రభసమునను,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

68


సీ.

అక్షయ మభవ మనాద్య మనంత మ- | ద్వయ మనామయ మనాహ్వయ మచింత్య
మవ్యక్త మనుపమ మనుపద్రవ మజేయ | మనసూయ మనపాయ మప్రమేయ
మసహాయ మలఘుత్వ మనఘత్వ మచలత్వ | మగుణత్వ మమితత్వ మమలినత్వ
మశిశుత్వ మవయోత్వ మజరత్వ మస్త్రీత్వ | మపురుషత్వ మషండమై సమంచి-


గీ.

తామలస్ఫటికాకృతియై వెలుంగు | మూర్తివై శాంతరసమున మొనసితౌర,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

69


సీ.

ఉరులింగమూర్తివై యుదయింపఁ గని రమా- | కాంతాబ్జభవులు విభ్రాంతులైరి
సతతము హాటకేశ్వరు భజించి రసాత- | లాధినాయకులు కృతార్థులైరి
వాలాయముగ మహాకాళేశ్వరునిఁ గొల్చి | భూలోకవాసులు పుణ్యులైరి

  1. ‘తూపులు వేయ’ అని పాఠాంతరము.