పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/611

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్వశురగేహ స్వీయసదనంబులే కదా | హిమనగ శ్వేతమహీధరములు


గీ.

నాలుదొనలు వియన్నది యమృతజలధి | నీ యశంబిట్టిదనుచు వర్ణింపఁ దరమె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

46


సీ.

కుంభిదైత్యస్ఫీతకుంభముల్ మోద వే | తొడరి మొమ్మొనల కైదువు గ్రహించి
శార్దూలయామినీచరుఁ గదనంబులో | జదుపవే చంద్రహాసము ధరించి
ప్రాకటపురసుందరీకంఠసూత్రముల్ | ఖండింపవే పినాకము వహించి
దునుమవే జాలంధరునిఁ బదాంగుష్ఠకృ- | దబ్ధిజావర్తమయారిఁ బూని


గీ.

తేజరిలె నీ ప్రతాపకాంతి ఖగరాజు | మోరఁ గల వెల్లఁదనమెల్లఁ జూరఁగొనియె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

47


సీ.

అర్ధనారివి నే యధార్థంబుగాఁ బూరు- | షాకారివని గొనియాడుటెట్లు
కొమరైన బవిరిగడ్డముగల్గు కతమునఁ | జెలిమియటంచు వచించుటెట్లు
నిరతంబును సమర్చనీయ లింగస్వరూ- | పుఁడవు క్లీబుఁడవంచు నుడువుటెట్లు
తలఁపఁ బరేతభూతలనికేతనుఁడవు | గృహమేధివనుచు నగ్గించుటెట్లు