పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాంచాలికుని లీలఁ బ్రాణుల నాడింతు- | వొకవేళ చర్మపుత్రికల కరణి-
నొకవేళ నైంద్రజాలికుని చందంబున | జీవకోటులయందు సేయుచుందు-
వొకవేళ నజముకుందోగ్రాఖ్యలఁ జరింతు- | వొకవేళ జ్యోతిర్మయుండవగుదు-


గీ.

వీశ నీ చర్యలెన్న వాతాశవర్య- | దివిషదాచార్యులకునైనఁ దెలివి గలదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

31


సీ.

తాండవలీలాప్రియుండవు గావున | డమరు డాంనిన విడంబము దగు
భిల్లవేషంబు శోభిల్ల ధరించితి | కల్ల గాదుర లేడిపిల్ల దగును
కొండకూతురిఁ గూడి కొండపై దిఱుఁగుదు | గండ్రగొడ్డలి చేత యుండఁదగును
నిచ్చలు విడువక బిచ్చంబునకు నేఁగు | జోఁగులవాఁడవు జోలె తగును


గీ.

భూమినే భూమికకుఁ దగు భూమవస్తు- | వులను గూర్చుట వేషికి యుక్తమె కద,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

32


సీ.

తావక శరసంగతంబయ్యె నేణశా- | బక మేమి తొల్లి తపంబుఁ జేసె
నీ శిరోవేష్టనమై శుభావహుఁడయ్యె | నహివర్యుఁ డే పుణ్య మాచరించె