పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/599

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గజసైంధవములు కింకరకోటులకు నిచ్చి | వృషభవాహనుఁడవై వెలసినావు
ముక్తాఫలకలాపములు నమ్రులకు నిడి | పునుకలపేరులు బూనినావు
పట్టాంబరంబులు భక్తాళికి నొసంగి | కటిపైనిఁ బులితోలు గట్టినావు


గీ.

యెన్ని జన్మములెత్తిన నిన్ను గెలువఁ | దగును నీవంటి విభుఁ డేడి దాసులకును,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

20


సీ.

భూతేశ నాకు నీవే తండ్రివి నగేంద్ర | పుత్రిక తల్లి సవిత్రి గంగ
శీతశైలేశుండు తాత మేనక యవ్వ | మైనాకుఁడే మేనమామ సుమ్ము
యన్న వీరన్న పెద్దన్న విఘ్నేశుండు | కొమరొప్పఁ జిన్నన్న కొమరుసామి
ప్రమథులు బంధువుల్ భసితంబు శ్రీగంధ- | మల శివాక్షసరము లలఘుమణులు


గీ.

వేయునన నేమిటికి కౌద్రవేయవలయ | పుడమిలోపల మా కేడుగడయు నీవె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

21


సీ.

నీ తనుజన్ముండు నిఖిలవిద్యల కెల్ల | దేశికస్వామియై తేజరిల్లె
నీ జటాగ్రంబున నెలకొన్న దేవశై- | వలిని త్రిలోకపావన మొనర్చె