పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కులగోత్రములు లేని గూఢమార్గున కెట్లు | కులగోత్రపతి తన కూతునొసఁగె
నతులామృతాపేక్షులైన మహర్షులు | విషధారి నాత్మ భావించి రెట్టు-


గీ.

లిలఁ బురాకృతపుణ్యంబు గలుగ నెట్టి- | వార లధికారులౌట ధృవంబుగాదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

11


సీ.

అతులితాష్టైశ్వర్యయుతుఁ డౌట చిత్రమే | రాజశేఖరుఁడయి ప్రబలు కతన
సమధికసౌందర్యశాలి యౌటరుదుకో | జగతిలో స్మరహరుం డగుట కతన
వివిధవిద్యావిదుఁ డవుట యచ్చెఱువె స- | ర్వజ్ఞసమఖ్యచే వరలు కతన
నిరుపమతరశౌర్యనిధి యౌట వింతయే | యంతకాంతకుఁడయి యలరు కతన


గీ.

నిట్టి మహిమంబు లెవ్వరియెడఁ గలుంగు- | నట్టి నినుఁ బ్రార్థన మొనర్తు ననుదినంబు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

12


సీ.

ఆదిభిక్షుఁడవయ్యు నఖిలేశ్వరుండ నా | నలరారు టిది విస్మయంబు గాదె
విసము కుత్తుకనిండ మెసఁగియు నెన్నఁడు | మృతిలేక యుండు టద్భుతము గాదె
యెవ్వరు ముట్టని యెముకఁ జేపట్టియు | శుచిమూర్తివైతివి సొబగు గాదె