పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

తిలగత తైలంబు తెఱఁగునఁ బూసల- | లోని దారము మాడ్కి మానిలోని
చేవ విధంబున శిలలోని లోహంబు | పగిదినిఁ బాలలోపలి ఘృతంబు
వడువున ననలోని వాసన కైవడి | దారువులోపలి దహను మాడ్కి
ఫలములోని రసంబు భాతి ధరిత్రీత- | లంబులోపలి నిధానంబు రీతి


గీ.

నరయమశకాది దంతిపర్యంత జీవ- | గణమునందున నుందువు కానరావు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

7


సీ.

హరివిరించులు కిటిహంసరూపములఁ ద్వ- | దాద్యంతములు గాననందువలన
కనుదమ్మితో వేయు కమలము ల్బూజింప | హరికి చక్రంబిచ్చినందువలన
బొంగుచు శ్రీరామలింగప్రతిష్ఠ సీ- | తాధీశుఁ డొనరించినందువలన
హరి యొక్కరుఁడె దైవమన్న వ్యాసునకు బా- | హార్గళస్తంభ మైనందువలన


గీ.

శరభసాళువమై నరహరినిఁ గెలిచి- | నందువలన మహాదేవుఁడవు నిజంబు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

8


సీ.

ఆరావ మొక్కటి భేరీమృదంగాది | వాద్యవిశేషము ల్వరుస వేఱు