పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/591

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పులినమేరునమేరు పుష్పఖండేందు స- | త్కటి పయోధర నాభి గండభాగ


గీ.

కలిత లసదన్నపూర్ణాంబికాముఖాబ్జ- | బాలసూర్య సదాపరిపాలితార్య,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

2


సీ.

జయజయ శయకుశేశయసంభృతకురంగ | జయ దుష్టజనసముదయవిభంగ
జయజయ వందారు నయనాంబురుహమిత్ర | జయ కలశాంభోజిశయనమిత్ర
జయజయ విధిహరిహయపోషణోల్లాస | జయ భవ్యనిర్జరాలయశరాస
జయజయ కృతబిలేశయరాజమణిహార | జయ మృకండుకుమారభయవిదార


గీ.

జయ మహోదార జయ నిరామయశరీర | జయ దయాపూర జయ సమిజ్జయవిచార,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

3


సీ.

దీనసంఘాతచేతోనీరజాత మ- | త్తాళివరాయ తుభ్యం నమోస్తు
ఫేనకాదేన సంతానబిసప్రసూ- | నాభదేహాయ తుభ్యం నమోస్తు
నీలాతసీసుమమాలాతమాలసం- | పజ్జిద్గళాయ తుభ్యం నమోస్తు
బాలాతపహుతాశకీలాతటిల్లతా- | భాకపర్దాయ తుభ్యం నమోస్తు