పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

546

మూడఁ జేసెదవు. కృధ్రనామకవు మున్నర్కంపురోగంబు, సకలామయంబులును నెమ్మి న్నన్ను సేవించు) లోనగుపద్యములవలనఁ గవి వ్యాధిపీడితుఁడై శతకమునందు బాధానివృత్తికిఁ గొన్నిపద్యములు రచించిరని తోఁచును. కొన్నిపద్యములు కవికిగల యాత్మగౌరవాభిమానములు, స్వతంత్రభావములు పూర్వాచారప్రీతిని వెల్లడించుచున్నవి. ఈకవుల గ్రంథములవలెనే శతకము గూడ నూతనభావసమన్వితమై వాఙ్మయమున నొకగౌరవస్థానముగా నొందఁదగియున్నది.

ఆధునికులు సుప్రసిద్ధులునగు శ్రీ తిరుపతి వేంకటేశ్వరకవుల జీవితచరిత్రము, వారి శతావధానసారము, నానారాజసందర్శనము, లోనగుపొత్తములవలనఁ దెలియుటవలనఁ నింతలోఁ గవితాప్రశంసయు నితరచరిత్రసందర్భములు జర్చింపక వదలుచున్నారము. ఈశతకమును పునర్ముద్రణము గావించుటకు సెలవొసంగినందుకు వారికి కృతజ్ఞులము.

తండయార్పేట,

ఇట్లు

చెన్నపట్నం.

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు

10. 1. 26.

అండ్ సన్స్