పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకము వ్రాసినకవులు బ్రహ్మశ్రీ తిరుపతివేంకటేశ్వరకవులు. ఆంధ్రకవులలో సుప్రసిద్ధులని పేరెన్నికగన్న యీకవియుగమురచించిన గ్రంథములను జదువనివారును ఈకవుల ప్రతిభాదికము నెఱుంగనివారును వర్తమానకాలమున జాల యరుదుగా నుండిరనుటలో సాహసము లేదు.

బహుగ్రంథరచయితలు శతావధానులు వివిధబిరుదాంచితులునగు నీకవులకవిత కేవల ద్రాక్షాపాకముగ మృదుమధురపదగుంభితమై యాదికవులకవితను సర్వవిధములఁ దలపించుచుండును. వీరి యాంధ్రీకరణములగు శ్రీనివాసవిలాసము, బాలరామాయణము, ముద్రారాక్షసము, మృచ్ఛకటికము, స్వతంత్రగ్రంథములగు శ్రవణానందము, బుద్ధచరిత్రము, పాణిగృహీత లోనగుపుస్తకములు భాషావిదులమన్ననకు యువకకవులవరవడికి గూడ బాత్రము లయ్యెననుట వీరి మహాకవితాప్రతిభకు దృష్టాంతములు కాగలవు.వీరికృతులలోని నీకామేశ్వరీశతక మొకటి. రచనాకౌశలమును విషయసందర్భమును బట్టి యీశతకము వేంకటశాస్త్రిగారు రచించినటులఁ దోఁచుచున్నది. (నా కేదిరోగంబు నీవివిచ్చన్ నిక్కము