పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31

నిని జూచి యపభ్రంశముగ వర్తించెననునంశము భస్మాసురకథ సహజమతాభిమానము నాధారపఱచికొని ఖండించినాఁడు. శివునకు నీశ్వరత్వ మారోపించుటయే కర్తవ్యముగాఁ బెట్టుకొని యీకవి పలుతావుల నితరదైవతదూషణము బ్రాహ్మశాఖలలోఁ జేరినయితరులనింద విరివిగాఁ గావించియున్నాఁడు.

పరమతనిందాగర్భితముగ శ్రీగిరిమల్లేశ, వీరభద్రశతకాదులు రచించిన కొమఱ్ఱాజు రామలింగకవి యీవేంకటశివునకుఁ బినతండ్రి యగుటచేఁ గాఁబోలు అన్యదైవదూషణమునఁ దండ్రి నటులుండుమనుచున్నాఁడు. మొత్తముమీఁద నీరాజలింగశతకమును వీరశైవమతసిద్ధాంతబోధకమని చెప్పవచ్చును. ఇందు బసవేశ్వర, సోమనాథ, మల్లికార్జునాది వీరశైవులు నెలకొల్పిన సంప్రదాయములు లక్ష్యమునందుంచి వ్రాయఁబడినపద్యములు పెక్కులు గలవు. శైవమతప్రతికూలురగు కొందఱు పురాణములలో శివునకుఁ గలయీశ్వరత్వము లోపింపఁజేయుటకుఁ గొన్నికల్పితకథలుఁ జేర్చిరనియు భాగవతమునఁ బోతరాజు సైతము విష్ణుమతాభిమానవశమునఁ గొన్ని శివప్రాముఖ్యముఁ దెలుపుకథలు లోపించెనని యీ క్రిందిపద్యములోఁ దనయభిప్రాయము దెలిపియున్నాఁడు.