పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

సంస్థానములో మునగాలకు ఐదుమైళ్లదూరములో నున్నది. విచారింప నాయూర రామలింగస్వామి దేవళము గలదని తెలిసినది. కవి వీరశైవుఁ డైనకతన రామశబ్దసహితముగ లింగశబ్దము నుచ్చఱింపనొల్లక రాజలింగమని పేర్కొనినటులఁ దోఁచుచున్నది. మతావేశపరవశు లిటులఁ జేయుటలో నించుకేనియు వింత లేదు.

ప్రకృతశతకము నూటయిరువదియేడు సీసపద్యములతో నిండియున్నది. శతకకవిత ధారాశోభితమై సులభసాధ్యమగు భాషలో మృదుమధురముగా నున్నది. అందందు వ్యాకరణదోషములుగూడఁ గలవు. వేంకటశివుఁడు మతావేశము గలవాడగుటచే నీశతకమున శివునికంటె దైవము లేడనియు నితరదైవతములు శివభక్తులనియు నీశ్వరశబ్దవాచ్యుడగు శివుఁడే నిఖిలదేవస్తుత్యుఁడనియు భస్మము రుద్రాక్షలు బ్రాహణుఁడు ధరించితీఱవలెననియుఁ గొన్నిపద్యములలో బోధించెను. మఱికొన్నిపద్యములలో స్కాందాదిపురాణములనుండి విషయసంగ్రహము గావించి శివపరేశ్వరత్వము పలుమాఱు స్థాపింప యత్నించెను. గంగ విష్ణుపదోద్భవియనునంశము, బ్రహ్మతల ఖండించుటచే శివునకు బ్రహ్మహత్య వచ్చినదను విషయము శివుఁడు మోహి