పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

269

యోచింప సమస్యపద్యమునే శతకకర్త సంగ్రహించినటులఁ దోఁచును. ఇంతకు మిగిలిన పద్యములు స్వతంత్రము లనియే యూహింపవచ్చును.

శతకములందలి పద్యములు శివలీలలు శైవులభావములు తెలుపుచున్నవి. పద్యములు భావములతో నిండి మంచినడకతో నలరారుచున్నవి. ఇందు లక్షణలోపములు మాత్రము తఱచుగాఁ గానవచ్చుచున్నవి. ఇత్వ అత్వములకుఁ బ్రాయికముగ యతి గూర్పఁబడియున్నది. గణనియమముగూడఁ బాటింపనితావులు కొన్ని గలవు. జీర్ణమై ఖిలముగానున్న యీయముద్రితశైవశతకమును ముద్రణమునకుఁ బ్రత్యంతరము వ్రాసికొన నవకాశము కల్పించి గ్రంథప్రచురణమునకుఁ దోడ్పడిన కో. వీరబసవయ్యగారు ప్రశంసాపాత్రులు.

ఈశతకమునందలి వీరశైవులలీలాదికములు అన్యవాదకోలాహలములోనిపద్యము ననుకరించుచున్నవి. భక్త్యతిశయముచే ఛందోనిబంధనలు పాటింపక కవిత చెప్పుటచేఁ గవి యిందుదోషములను గమ