పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

ఈజ్ఞానప్రసూనాంబికాశతకము కాళహస్తివారియాస్థానములో నున్నపుడు రచింపఁబడినదియే.

సర్వశాస్త్రి తనతండ్రిగారు గతించిన రెండుసంవత్సరములకు అనఁగా క్రీ॥శ॥ 1872 సంవత్సరమునఁ గీర్తిశేషుఁడయ్యెను. ఈయన వ్రాసిన పుస్తకములలో జనాదరణపాత్రమైనది యమరుక ఆంధ్రీకరణము. ఇది చిరకాలముక్రింద ముద్రితమైనది. ఇపు డీప్రతులు సైతము లభించుట లేదు. జ్ఞానప్రసూనాంబికాశతకము నిర్దుష్టముగ ధారాశోభితముగ నున్నది. కవి యుభయభాషలలో నిరంకుశుఁడనుట కిందలిపద్యములే తార్కాణము కాగలవు. తెలుగుభాషలో నిట్టి సర్వాంగసుందరములగు శతకములు చాలయరుదుగా నున్న వనుట సత్యదూరముకాదు. ఈశతకమును జక్క సంస్కరించి యీభక్తిరసశతకసంపుటమున కలంకారప్రాయముగఁ జేర్చితిమి.


చెన్నపురి.

ఇట్లు,

26.1.1926

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్