పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొట్టుముక్కల రాజగోపాలశతకము

181


మ.

యమునం దా వసియించుబోటి కీల వ్రయ్యల్ చేసి రప్పింపఁడే
రమణన్ రాముఁడు లాంగలాగ్రమున మీరాజత్ప్రభావంబు ల
య్యమరశ్రేణులకైన నెన్న వశమౌనా! సంగరాభంగశా
ర్ఙ్గమహాకార్ముక గొట్టు...

70


మ.

నిమిషార్ధంబున సూతు నైమిశమునన్ నిర్జించినన్ శౌనకా
దిమునుల్ వేగ హలాయుధుం డతని నెంతేజీవితుం జేసె లో
కము లెన్నన్ నిబిడానురాగమున రంగద్రుక్మిణీదత్తహృ
త్కమలారాత్రిక గొట్టు...

71


మ.

కురురాజన్యుఁడు భీతినొంద హల మక్షుద్రంబుగన్ సాచి త
త్పురియొడ్డేర్పడ గడ్డయెత్తె బలభద్రుం డండ్రు; మీశౌర్యవై
ఖరి మీకే తగుగాక యొడ్లకగునా కౌంతేయ సద్భోగభా
గ్యరమాస్థాపక గొట్టు...

72


మ.

అరిభావంబుననైనఁగాని నిను నిత్యం బాత్మఁ జింతించినన్
బరమానందపదంబు సంభవిలు కార్పణ్యంబుచేఁ బౌండ్రకుం
డరియై నిన్నె భజించి ముక్తిఁగనె దేహాంతంబునన్ గాలపు
ష్కరముగ్మేచక గొట్టు...

73


మ.

గరిమన్ నిన్ను బరీక్ష సేయ భవదాగారంబులన్ జేరి ని