పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

దిట్టకవి రామచంద్రకవికృత

గొట్టుముక్కల రాజగోపాలశతకము

శా.

శ్రీభద్రస్థితు లాశ్రితావళుల కక్షీణానుకంపన్ సదా
లాభప్రాప్తులుగా నొనర్చు నజులీలామోహనాకారమా
యాభీరున్ నినుగూర్చి మ్రొక్కుదు ననల్పాకల్పతల్పాయిత
క్ష్మాభృత్పన్నగ గొట్టుముక్కలపురౌకా రాజగోపాలకా.

1


శా.

హేలాసమ్మిళితత్రిమూర్తిరుచియౌ హేరంబుఁ బ్రార్థించుచున్
గాళీదాసమయూరమాఘముఖులం గైవారముల్ చేసి నిన్
వాలాయంబుగఁ బూజసేతుఁ గవనవ్యాపారవిస్తారవా
గ్జాలాబ్జంబుల గొట్టుముక్కలపురౌకా రాజగోపాలకా.

2


శా.

చక్రీ చక్రిశయాన; యాననజితాంచత్పూర్ణతారాపతీ
నక్రగ్రస్తగజేంద్రరక్షణమతీ! నానాప్రపంచాకృతీ