పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

భక్తిరసశతకసంపుటము


ఢ్యజదుర్వాంఛలు మాన్పి యొక్కయెడ వేడ్కంబోలె నీదివ్యనా
మజపం బూనగ బుద్ధి నియ్యగదె శ్రీమద్దాలి...

57


మ.

గుజుగుం ట్లెంతయు దీర కైహికపుసంకోచంబు చేతం గజీ
బిజిగా చింతలె పుట్టసాగె నిఁక నిన్ బేర్కొంటకె ట్లిట్టిఛ
ద్మజుగుప్సం బెడబాపి సాదఁగదె శ్రీమద్దాలి...

58


మ.

గజబంధి న్యుపమానమై యిహ మసౌఖ్యప్రాప్తి నొందింపసా
గె జుగుప్సం బడఁజాల నింక భవదంఘ్రీద్వంద్వసేవానికా
మజగన్మోహనబుద్ధి నా కొసఁగవే శ్రీమద్దాలి...

59


మ.

భుజమధ్యంబున లచ్చి పార్శ్వయుగళిన్ భూమీళ లుప్పొంగ భ
క్తజనుల్ గొల్వఁగ నోలగం బమరునిన్ గన్గొందుఁ గన్నార సో
మజటాజూటసుతాత్మ కన్పడఁగదే మద్దాలి...

60


మ.

గజమె ట్లట్లుగ నేను కర్మఫలనక్రగ్రస్తతన్ బొంది యా
ధిజబాధం బడియున్నవాఁడఁ గరుణాధీనుండవై భావిజ
న్మజుగుప్సాతదవస్థఁ బాపఁగదె శ్రీమద్దాలి...

61


మ.

మృజము న్మున్నుగ శుద్ధి దేలిచెద సామీ యోమిఁకన్ నీమహా
భజనాగాంగఝరీరసం బొసఁగవే బల్మాఱు మత్కల్మషా