పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

సుప్రసిద్ధుఁడు దిట్టకవినారాయణకవి కీశతకకర్త యగు రామచంద్రకవి కుమారుఁడు. ఈకవి సమగ్రజీవితము మహిషాసురమర్దనిశతకమునఁ జేర్చియున్నారము గాన నిందు దిఙ్మాత్రముగా నుదాహరించుచున్నారము. ఈ రామచంద్రకవికవిత నిర్దుష్టముగా నిరర్గళధారాశోభితమై మనోహరముగానుండును. ఇతని గ్రంథము లింతవఱకు మా కీక్రిందనుదాహరించినవి మాత్రము లభించియున్నవి. ఇంకను బ్రయత్నించినచోఁ గొన్ని గ్రంథములు లభింపవచ్చుననునాసగలదు. 1.మహిషాసురమర్దనిశతకము, 2. గొట్టుముక్కులరాజగోపాలశతకము, 3. ఉద్దండరాయశతకము, 4.రఘుతిలకశతకము, 5. వాసిరెడ్డివారిచరిత్రము, 6. హేలావతిదండకము, 7. చాటుపద్యములు.

రామచంద్రకవి చిరకాలము వాసిరెడ్డివారిసంస్థానమునందు వేంకటాద్రినాయఁడువారి కాస్థానకవియై యుభయభాషాపండితుఁ డని పేరుగాంచెను. ఇతనిచాటుపద్యములఁ బట్టి చూడఁ గాలక్రమమున నాకాలమునఁ బేరుపడియున్న వెలమసంస్థానము లన్నింటిని జేరి ధనార్థియై రాజాశ్రయముతోఁ గాలము గడిపినటుల ద్యోతకము కాగలదు.

ఉద్దండరాయశతకకర్తయగు దిట్టకవిరామచంద్రకవి యిప్పటికి నూరుసంవత్సరములక్రిందట నుండియుండును. ఇంతవఱ కీకవి గ్రంథములుగాని సుప్రసి