పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈ సూర్యనారాయణశతకమును వరాహవేంకటనృసింహకవి రచించెను. ఇతఁడు భారద్వాజ గోత్రుఁడు, బ్రాహ్మణుఁడు. జగన్నాయకశతకము రచించిన వరాహగిరి కొండరాజు నీతఁడు నేకగోత్రులె గాని యిరువురును తమ పూర్వులను జెప్పికొనకపోవుటచే నిందెవరు పూర్వులో యిరువురకు గల సంబంధమెట్టిదో యెఱుఁగ వీలు కాలేదు.

"శ్రితసంపత్సుమవల్లియౌ సరసవెల్లిన్" అను పద్యమువలనఁ గవి నరసవెల్లిలోని సూర్యనారాయణస్వామిని గూర్చి యీశతకము రచించెనని యూహంపనగునుగాని నరసవెల్లి యెచట నున్నదో కవి సంబంధు లెవరేని యటఁ గలరేమో తెలియవచ్చుటలేదు. తత్రత్యు లీవిషయమునఁ బ్రయత్నించి కవిజీవితము ప్రచురించుట యవసరము.

ఈ సూర్యనారాయణశతకము భాష జటిలముగ సాంస్కృతిక సమాసబంధురముగ నున్నది. కొన్నిచోటుల పద్యమునంతటి నాక్రమించికొనిన సమాసములు గలవు. భావములు స్వతంత్రములై రమణీయములై యున్నవి. సూర్యభగవానుని తేజోవిభ