పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకమును రచించినది దిట్టకవి రామచంద్రకవి. ఇతఁడు కాశ్యపసగోత్రుఁడు. రంగారాయచరిత్రము వ్రాసిన నారాయణకవికుమారుఁడు.

రఘుతిలకశతకము కందపద్యములలోఁ గడుమనోహరముగా వ్రాయఁబడినది. కవి నిరర్గళధారాశోభితుఁ డగుటచే భక్తిరసము గురియునటులఁ జక్కనిపోకడలతో శతకముఁ బూర్తి చేసియున్నాఁడు. ఒకపద్యమును జదివితి మేని శతకమంతయుఁ బూర్తిచేయనిది తోఁచనంత సరసముగా నీశతకము వ్రాయఁబడినది. ఇందలి పద్యములయందు శ్రీరాముని దివ్యలీలలు సజీవముగాఁ జిత్రితములై యుంటచే ముముక్షువుల కియ్యది ముఖ్యముగాఁ బఠనార్హముగా నున్నది.

ఈకవిజీవితము విపులముగా మహిషాసురమర్దనిశతకములో నుంటవలన నిచట నుదాహరింపక మానితిమి. రామాయణమునందలి ముఖ్యాంశములు శ్రీరామునిదయాశాంతాతిమానుషలీలల నుద్బోధించునంశము లొక్కటొక్కటి యొక్కొక్కపద్యమున మనోహరముగాఁ గూర్పఁబడియున్నందునం