పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము

     !! క్షత్రధర్మంబు స్మృతివాక్య సమ్మతంబు
     ధర్మసంస్థాపనార్ధంబు ధరణిలోన
     సద్గురూపదిష్టముగాన జంకకుండ
     శంబుకుని రామచంద్రుడు చంపుచుండె

    (భిన్నమస్త గుఁడై శంబుకుడు నేల వ్రాలును, దివ్య తేజము
     మింటి కెగయుచు శ్రీరామచంద్రుఁడు నిష్క్రమించును)


శంబుక శిష్యుని ప్రవేశము.



     ఏమందుఁగటకటా ! యిటివిడ్డూర
     మీముందు జిరిగెనే, యెచ్చోట నేని !
     చలిచీమ నేనియుఁ జాద్రొక్కకుండ
     వనసీమలోపలి వసియించి యెపుడు
     పొగఁద్రావి తపియించు. పుణ్య పూరుషుని
     శంబుక సంయమి? చంద్రు మద్గురుని
    బ్రాహ్మణులెల్ల గా పట్యంబుతోడఁ
    బసరిచ్చి యొక విప్ర బాలు, విసంజ్ఞు
    గాఁ జేసి యయ్యది కల్గె శంబుకుని
    జపము చేనని చెప్పి చాటించి రామ
    చంద్రుచే మద్గురుఁ జంపించి పిదప
    బ్రాహ్మణ బాలుడు బ్రదికినాఁడనిరి
    ఎన్న డే బ్రదుకునే యీల్గినవాఁడు
    ఏమి యీదు స్తంత్ర మేమి యీమాయ !
    ఏమి యీ గారడి? యేమి యీకుట్ర?
   ఏమెట్టుజీవింతు మేమెట్టుబ్రదుక
   గలవారమికమీద గాలుష్యమౌర

,