పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

శంబుక వధ

 
          రిచ్చుదానమును గ్రహింతును.ఏమి చెప్పుటకుఁదోఁచక శ్రీరామ
         చద్రుఁడు దిగాలున నిలువంబడియుండ వసిష్ఠుఁడక్కసుగ్రక్కు
         చున్న చూపులతో, బిల్ల వానిఁ జేయిపట్టుకొని లాగి) వ!! మిమ్మాద
          రించుటకు మేముంటిమి లెమ్ము. ఇటురమ్ము. (శ్రీరామచంద్రు
         నితో) పిల్లవాని మాటలతో నేమిగాని నీకార్యాచరణమునకు బొమ్ము

శ్రీ: దేశి కేంద్రా ! అబము సుబమెఱుఁగని కసుగందు. ఏమియుఁ
         జేయకుఁడు.

వ:- మాది మాత్రము కన్న కడుపు కాదా? (శ్రీరామచంద్రుడు
         నిష్క్రమించును)

బ్ర:- (కంటినీరు కంటఁగ్రక్కు కొన్ని అయ్యా! మీరు లేకేమి; మా
        తాతలనాటినుండియు సంపూర్ణ కటాక్షముతోఁ జూచుచునే యు
        న్నారుకదా.

వ: లంకను బుట్టిన వారందఱు రాక్షశుసులే. క్రొత్త లేమియుండును

బ్ర:- మీరు చెప్పినది మాత్రము నిజము కాదు. లంకలో బుట్టిన విభీష
       ణుడు రాక్షసుడుకాడా ! (నిష్క్రమణము)

       (శ్రీరామచంద్రుఁడు. తపోనిష్ఠనున్న శంబుకుని జేతి కోశమున నున్న
       ఖడ్గమునుబెఱికి, ఝళిపించి మరల నాగి: విషాదముతో
        గుడిచేయివంకఁ దేఱి పాజ జూచి)

       చం|| కరుణ యొకింతలేక కుల కాంతను, సాద్విని, బూర్జ గర్భిణిన్-
       వఱకు నరణ్యభూములకు, బంపగజాలినయట్టి నీకు దు
       ర్భరమగునే యొకానొకని ప్రాణము తీసెడుపట్ల మౌని శే
       ఖరుఁడగుకాక జాలియెటు కల్గును? . దక్షిణ భాహుడండమా!

       (మరల నుత్సాహముతో ఖడ్గ మెత్తి)