పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము

69


-
         అపరాధియైన నేమి ? నిరపరాధియైన నేమి ? శాస్త్ర సమ్మతమైన
         నేమి ! గర్హితమయిన నేమి ? ఒక్కని మరణముచే రెండు కులములు
         సిరిసంపత్తులచే దులదూగ నప్పుడు తామరతంపర క్రియ వృద్ధి
         నందునప్పుడు వెనుకంజ వేయకము. ఆత్మరక్షణమెల్ల జీవులకు
         నవశ్య కర్తవ్యము.

శ్రీ: పాపముఁ జేసి మనుటకన్న "( బరోపకారమాచరించి, మరణించి
        యశః కాయు డగుట యుక్త ముకాదో ?

వ: __అందు చేతనే నిన్నీ కార్యమునకు బురికొల్పుట. లేకున్న ధర్మ
        సూక్మ వేదులమయిన మేమిట్టిపనికిఁ బూనుకొందుమా? ఒకనిని
        జంపి జాతిద్వయమును సముధ్ధరించుట పరోపకారము: కాదా?
        లెమ్ము. కార్యోన్ముఖుఁడవు కమ్ము. ఆలకింపంకుమ'.

శ్రీ:- (తనలో) కొంత వఱకు సందియము దీరినది. ఇది న్యాయముగా '
       కున్న నీ మహనీయుఁ డింత పట్టుదలతో నేల చెప్పును? ((ప్రకాశముగా)
       గురువరా! ధర్మాధర్మ విచారణ భారము గుర భుజస్కంధమున
       నుండును. గురూపదేశంబు వ్యపగతకల్మషంబుగాన శంబుకుని
       బరలోక ప్రాప్తుని జేసెదము. మేమిదేపోవు చుంటిమి, సెలవిప్పి
       పుడు. (పోఁబోవును, పాదుత్రవ్వి నీళ్ల పోయ చున్న బ్రహ్మచారీ
       వాక్యము. లాలించి కన్నీటిచే డగ్గుత్తిక వడిన స్వరముతో శ్రీరామ
       చంద్రుని కడ్డపడి)

బ్ర: -మహాప్రభూ ! మా బాబయ్యగారిని జంపెదరా ! వలదు. వలదు.
       మమ్ములనందని దిక్కు లేనిపక్షులను జేసెదరా ! ఇంతకుమున్ను
       నే గోరిన వస్తువు నిచ్చెదనంటిరి. మా బాబయ్యగారి ప్రాణము
      నాకిండు, మాబాబయ్యగారిష్ట పడినను బడకున్నను నేను మీ