పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము

59

 
        మయితిమి. కాని మత విషయక ప్రసంగమును 'జేయనుద్దేశించి
        యీయెడ కరుదెంచితిమి. రాజు ధర్మము మీకు దెలియనిది కాదు.
        మేము హిందూ మత సంస్థాపనాచార్యులము. హిందూమత రక్షణ...
        ణార్దమై సూర్య సంఘము సాకేతపుర సింహాసనమున నుండి సూర్యుని
        దొట్టి నేటిదనుక రాజ్య మేలుచున్నది. కాన మతరక్షణము
        మాకుఁ గర్త్వమే కాక విధ్యు క్తధర్మము. మతద్రోహ మా
        తలకంటగింపు, మేము సహిఁపము. మాప్రజలయం దెట్టిమత
        ద్రోహియున్న శిక్షించుటకు వెనుదీయము. హిందూమతమునఁ
        బుట్టి హిందూమతమునఁ బెఱిగి, హిందూ మతమునకు ద్రోహ
       మాచరించువాడు నరక కూపమునఁ బడకమానడు మేము నిమి
       త్తమాత్రుల మయి యూనీచుని శిక్షాపాత్రుని జేసెదము.

శం:- దేవా ! యిది నేనెఱుంగనిది కాదు. మతద్రోహులను శిక్షా
       పాత్రులు జేయుట రాజధర్మము. కాని నాడు రాజులు తమ
      ధర్మము నెఱవేర్చని పాపమ నంబోదురు.

శ్రీ:- అందుచేతనే నేడు మేమిచ్చటి కరుదెంచి మీరు చేయుచున్న
      కార్యములు, మతోపన్యాసములు, మతద్రోహములగునో కాదో
      నిర్ణయింప జనుదెంచితిమి.

శం:--సకల ధర్మస్వరూపులగు వారీ కార్యమ బూనుట కంటె మా'కు
       సంతోషదాయకమగు కార్య మేమున్నది ! మీసాన్నిధ్యమున
       నీ కార్యము నిర్ణయింప బడుట కంటె మాకు వలయునది యేది?
       దేవర వారడిగిన ప్రశ్నములకు నాయెఱింగిన యంత వట్టునకుఁ బ్రత్యు
       త్తరమి చ్చుటకు సంసిద్దముగ నున్నాడను. (శిష్యులకై తిరిగి) వత్స
      లారా! మీరుపర్ణకుటీరమున వేదపాఠము జేయఁబొండు.

      (శిష్యులు నిష్క్రమింతురు.)