పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

శంబుక వధ


 
శ్రీ:- ఏమి ! శంబుకర్షియా !

బ్ర:- (అబ్బురముతో) ఏమి యులికిపడు చున్నావు : ఎప్పుడును బేరు
          విన లేదా? నీ వేదియో పట్టణవాసివని తోచుచున్న ది.

శ్రీ:- (తనలోఁ బరాకుతో) నాడఁబోయినతీర్థ మెదురై నట్లున్నది
         (ప్రకాశముగా) అవును. పట్టణ వాసినే; కాని మీగురువు గారిని
         దర్శించుటకు వీలుండునా ?

బ్ర:— ఓ యిది యే మంచిసమయము. మాగురువు గారీ వేళనే శిష్యులం
        గూర్చికొని మత ప్రసంగముఁ జేయుచుందురు. ఇదియే దారి. చూ
        చితివా ! ఈ దారి నేపోయి యాబట్టలాఱ వైచిన పొద దగ్గరనుండి
        యాకుటీరము' బ్రవేశించిన మాగురువు గారిని జూడగలుదువు.
        (ఏదియో జ్ఞాపకమునకు రాగా) పొఱ బాటు. ఆఖర్జూరవనమునం,
        దీవేళ మతోపన్యాసముఁ జేయుచుందురు.

శ్రీ: సరియే నేను నెవెళ్ళెదను (ముందునకు నడచి తిరిగి వచ్చు చుండును)

బ్ర: ఏమి తిరిగి వచ్చుచున్నావు ! దారి తెలియదా ! నే మజూపించె
        దనురమ్ము

శ్రీ:- అట్లు కాదు నీవు ముందు వోయి మీగురువు గారితో శ్రీరామ
       చంద్రుడు మిమ్ములను జూచుటకు వచ్చుచున్నాడని చెప్పఁగల్గు
       దువా?

బ్ర:- (నివ్వెఱగంది) ఏమి శ్రీరామచంద్రులా; మారాజుగారా !
      దేవా ! యెవ్వరో సామాన్యులనుకొని మీకు దగిన సత్కారమును
      జేయ లేదు. రాజాధి రాజులను సందర్శించినప్పుడెట్లు చరియింప
      వలయునో మా బాబయ్య గారును జెప్ప లేదు. చాందసులము కదా!
      క్షమింపుఁడు,