పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

శంబుక వధ.


        జతురామ్నాయములందలంచుచు నమస్కారంబులం జేయుచున్
        స్మృతి ధిక్కారము జల్ప బూనితిమి మాక్షేమాభిలాషంబుచే..2

       మ|| ప్రభుచూ డామణి మీరు వేదములనే ప్రామాణ్యముంగొన్న చో
       సభా కేతెంచెద మట్లుగానియెడ మీ ! సాన్నిధ్యముంజేరి మీ
       సభికుల్ చేసెడి వాదముల్ వినుటకు • సామర్ధ్యమున్ లేదుమా
      కభయం బిచ్చెడు వారు గానఁబడరే న్యాయంబు పోకుండగన్.... 3

      ఇయ్యది చాలు, నీయుత్తరముం గొంపోయి సేవకునికిమ్ము.
     ఆవల నేమి జరుగునో యోర్చి చూచెదము. కార్యంబుల దీర్చికొ
     నుటకు సరయూనదికిఁ బోవలయును. ఇక జిరి కాలము శాంత
     ముతో సంధ్యావందనాదులఁ జేసికొనుటకు వీలుండదు.

శి:-చిత్తము

నిష్క్రమింతురు.

తృతీయాంకము

.

సంపూర్ణము.