పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంక ము.

51


శి:- శ్రీ రామచంద్రునివని, ఇందులకు సందియమేల ?

శం:- నీవు పొరపడితివి. కాదు. ఇవి వసిష్టుని వాక్యములు. స్మృతి
         విహిత ధర్మ తిరస్కారులని యుత్తరమునందు: జేర్కొనఁబడినది.
         ఇంకదీనికి వాదమే మున్నది ! ప్రతిపక్ష రచిత గ్రంథములగుటచే
         స్మృతులు మన కాదరణీయములు గావను మన మొఱ నెవరాలకిం
         తురు ! వేదప్రతి షిద్దమని చెప్పసాహసించె నేమో చూచితివా !
         దీనికి సభాముఖమునఁ బరిష్కార మేమున్నది ? ఒక్కటేగతి వారు
         వేద ప్రామాణ్యము నంగీకరింపరు మనము స్మృతి ప్రామాణ్యము
         నంగీకరింపము. మనవాదము ధర్మాధి కారికి ధర్మ విరుద్ధమగును.
         మనము శిక్షకుఁ బాత్రుల మగుదుము. ఇంతియే ఱేపు, జరుగ
         నున్నది. కానఁ బత్రమును, లేఖిని గొనిరమ్ము. ప్రత్యుత్తర
         మంపెదము.

        (శిష్యుఁడు నిష్క్రమించి పత్రము లేఖినితోఁ బ్రవేశించును.)
        సిద్ధముగనుంటివా ! నేను చెప్పు వాక్యములు వ్రాయము.
        (శంబుక చెప్పుచుండగా శిష్యుడు వ్రాయును.)

       మ|| అతిలోభంబుకుబూని యూత్మహిత కార్యస్థానాచార్యులై
       స్మృతి నిర్మాణవిదగ్దులై తనరు వారిన్ సభ్యులఁ జేసి త
       ద్దిత పక్షుండవు ధర్మపీఠము నయం దేకూరు చుస్నంతమా
       గతియేమౌనొ యెఱుంగఁ జాల మొకొ యింకన్ రామచంద్రప్రభూ...1

       మ! మతనిర్మాణము కై వచించి ఋషులామ్నాయంబులంబిమ్మటన్
       స్మృతులన్ చెప్పిరి యార్యసంఘ 'మొగి వర్దిల్లంగ మేమందుచే

.