పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

శంబు క వధ.


శం:- : గదా ! యింకొక్క సంగతిఁ జెప్పమఱచితిని. వాల్మీకి మహా
             ముని యసాధారణ శేముషీధురీణుఁడు. రావణుడు మహా పాతకి
             యని ఋజువు చేయుటకుఁగా రావణుడు సీతా దేవిని బలాత్కార
             ముగా మానహానిఁ జేయమికి నేదో యొక శాపము నాటంకముగాఁ
             గల్పించి లోకులను విభ్రమపాలు చేయఁగలడని నాకు దోఁచు
             చున్నది. అయినను మనము నిజమును గొలఁధి దినములలో నే
             జూడఁ గల్గుదుము.

అం:- (వినయముతో), దేవా ! మీ మనస్తైర్యమే నిశ్చితార్థమును
            సంపొదించ గలదు. ప్రొకృత జనంబులకు మాచరిత్రము దురవగా
           హము. ద్విజులు మిమ్ముఁ బాషండుడనియు, మతద్రోహి
           యనియు దెగడుదురు. ద్విజేతరులో విద్యాగంధము లేమిచే
           బ్రాహ్మణ ద్వేషియనియుఁ దన్మూలమున రాజదండనకుఁ బాత్రు
           డనియు గొణుగుదురు. కట్టకడకు మీరిరు తెగలకుఁ గాని వార
           గుటయే ఫలితము. సముహత్వతత్వముఁ దెలిసికొనఁజాలక
           ద్విజేతరులు కృతఘ్ను లగుటయే కాక కృతాపరాధులగు
           చున్నారు.

శం:-- యువరాజా! తెవులు గొంటునకు మందు రుచింపదని చెప్పి స్వాదు
         పదార్థము నొసంగుట యుక్త మో ! నేనెందులకుఁగాను పోరాడు
         చుంటినో ద్విజేతరులు కొన్ని నాళ్లకయినఁ దెలిసికొనక పోదురా !

అం:- (పొరలి వచ్చుచున్న దుఖముతో,) నిన్న శ్రీ రామ భద్రుని
        సభాముఖమున జరిగిన . చర్చకు బరిశీలింప నింక జిరకాలము
        మీసందర్శన భాగ్యము మాబోంట్లకు 'దొఱకదని సందేహము
        పొడము చున్నది. మిరీసాకేతము విడచి దక్షిణ పధమునకు