పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

శంబుకవధ

 
అం : దేవా ! యిదిసత్యము కాని రావణునిమాటం తలపెట్టకుడు.
                    మీ వంటి వారు తల పెట్టఁదగిన నామము కాదు. అతను నీచుడు,
                     పరాభార్యాపహారి.

శం:- కుమారా : నిజమేయనుకొనుము, అతఁడు సీచుడే; అనీచుని
                    యందు నొక సుగుణమున్నది కనిపెట్టగల్లితివా ?

అం:- దేనా ! వానిం గూచ్చేప్రస గింపకుఁడు క్రోధముంగులకుండ వా
                   నింగూర్చివిన జాలను.

శ:- ఇదిగో ! యయొక మాటనే వినుము. తొందరపడి వివరమును
                   బాడుచేసికొనకుము. దానలాభముగ ల్గ బోదు.

అం:- అటులయినచో 'సెలవిండు, వినియెదను. ఆసుగుణ మేది?

శం:-- రావణుడు సీతామహా దేవిని దొంగిలికొనిపోయినాడనియే
                   కదా నతడు నీచుడంటివి.

అం:- అగును, అందుచేతనే.

శం:- కొనిపోయి యేమిచేసినాడు ?

అం:- అమహాపతివ్రతను బెట్టరాని బాములు పెట్టినాఁడు,

శం:- బాములు పెట్టినాడుగాని యామహా పతివ్రత పాతివ్రత్యమునకు
                  దోషము గలించినా,?

అ:- అది. వాని సుగుణము కాదు. దానికిఁ గారణమా జనని సౌశీల్యము
                 నాత్మ బలమును. సాధ్యమైనచో నానీచుఁడు చేయ రాని పాప కార్య
                 మొకటి యుండునా ?

శం:-- ది క్పాలక జేత యపకారము దలంచు కొన్నచో దిక్కు మాలిన
                 యబల యేమి చేయగదు? యోజుంపుము. ఇది వాని సుగుణమో
                 దుర్గుణమో ?