పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంక ము.

41



 '
శం:- అనఁగా ద్రావిడులకు నభిమానము లేదని, నీయూహము.
                     తొల్లింటి మన పూర్వులచరిత్రముఁ జదివి చూడుము. ఆర్యులకు ననా
                    ర్యులకుఁ బ్రవర్తిల్లిన భయానకరణంబుల దంక క్షణకాలము నీమ
                    నోనేత్రమును బ్రసరింప జేయుము. ఈయుద్ధములన్నియు నేటికి
                    సంభవించినవనుకొంటివి ? మూల కారణమును యోచింపుము,
                   నీసంశయములు పటాపంచలగును.

ఆం:- ఆర్యలకు ననార్యులకు యుద్ధములని తలపోయను.
                  దేహ దార్డ్యముక లిగి విదేశముల నుండి తండోప తండములుగ మన
                  దేశముపై బడి దేశమును గొల్ల గొట్టుచు మన పూర్వుల వెన్నాడు
                  నప్పుడు యుద్ధము లెట్లు పొసంగును. ప్రత్యర్ది నిల్చినప్పుడుకదా
                  సమరము. యుద్ధము లేకుండఁగనే చేనై నంతవఱకు నార్యుల నార్యు
                  ల నులిమి వేసిరని నాయాశయము.

శం:- కుమారా ! యంగదా ! మన పూర్వులు భీరువులనియా నీయా
                 శయము. ఎంత వెర్రిపడితివి : ఆర్యులతో హోరాహోరింబోరి,
                 కచాకచింబెనగి, బాహా బాహిందొడరి తుముల సమరంబుఁ జేసిన
                 వారలు మన పూర్యులు. నీవన్నట్టు లార్యులు శీతల దేశములనుండి
                 వచ్చుటచే మిగుల శిరీరసత్వయి కలవారగుట చేతను, రణధర్మము
                 ల బాలింపకుండుట చేతను దుట్టతుదకు విజయము గాంచిరి.
                 అనంతరము నీవనినది జరిగినది. ఎక్కడికో పోవుటేల ! రావణుఁడు
                 బలపరాక్రమ సంపన్నుడా ! లేకరజ్జులాఁడా?.. మీసాహాయ్యము
                 లేకున్న రాముడేమయినఁ జేయశక్తి మంతుఁడగునా ! మీతో
                 డ్పాటు మాట యటుంచుము జాతి ద్రోహియు, గులద్రోహియు, వంశ
                ద్రోహియు, ఖాతృదోహియునగు, : భీషణుఁడు రాజ్య కాంక్షచే నిం
                టిగుట్టు తెలుపకున్న రాముఁడు వ్యర్థ ప్రయత్నుడగువాడు లేదా